గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 48 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఒం శ్రీమాత్రే నమః.

తే.గీపగలు కొలుపునీ కుడికన్ను పరగు రవిని,

రాత్రిఁ గొలుపు వామాక్షము, రాజుఁ గలిగి,

నడిమి నేత్రమగ్నియగుటన్ నడుపు సంధ్య,

కాలరూపమే నీవమ్మ కమలనయన! 48
భావము.
జగన్మాతా ! నీ కుడికన్ను సూర్యుని రూపం . అందువల్ల అది పగటిని కలిగిస్తున్నది . నీ ఎడమ కన్ను చంద్రుని స్వరూపం. అందువల్ల అది రాత్రి ని తలపిస్తున్నది. కొంచముగావికసించిన బంగారు కమలము వంటిదైన నీనొసటియందున్న మూడవ నేత్రము యొక్క దృష్టి , దివారాత్రముల మధ్య సంచరిస్తున్న ప్రాతస్సంధ్య, సాయంసంధ్య, అనే ఉభయ సంధ్యా కాలములనూ చక్కగా ధరిస్తున్నది. (అనగా ఉభయ సంధ్యలనూ పుట్టిస్తున్నది).

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.