జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. విధికిరీటంబిది పదిలంబుగా నీవు తప్పించుకొని నడు, తగులకుండ,
హరి
కిరీటంబది, యటు
కాలు మోపకు,
కాలుకు తగిలిన
కందిపోవు,
నింద్రమకుటమది,
యిటుప్రక్క పోబోకు,
తగిలినచో బాధ
తప్పదమ్మ,
ప్రణమిల్లుచుండిన
భక్తుల మకుటమ్ము
లనుచుపరిజనంబులనెడివాక్కు
తే.గీ. లటకు
నరుదెంచుచున్ననీ నిటలనయను
నకు
పరిజనులముందున నయతనొప్పి
రాజిలుచును
సర్వోత్కర్షతో జయంబు
గొల్పు,ను
సదాశివునిగొల్చు కూర్మి
జనని! || 29 ||
భావము.
అమ్మా! నీ ముందున్న బ్రహ్మను తప్పించుకొని దూరముగా నడువుము. విష్ణుమూర్తియొక్క కిరీటమును తప్పించుకొని దూరముగానుండుము. మహేంద్రుని తప్పించుకొని దూరముగా నడువుము. వీరు నమస్కరించుచుండగా, నీ మందిరమునకు వచ్చిన, పరమేశ్వరునకు వెంటనే, నీ పరిజనుల ముందు సర్వోత్కర్షతో విరాజిల్లు చున్నది. మూడు గ్రంథులుదాటి సదాశివస్థితికి చేరిన/చేరగలిగిన సాధకునకు జయమును గొల్పును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.