గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 100 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీనీ చేతి డివిటీల నీరాజనంబును సూర్యదేవునికిచ్చుచున్నయట్లు,

శశికాంతిశిలనుండి జాలువారెడి బిందు జలములనర్ఘ్యంబు శశికొసంగు

నట్లుదకంబులనర్ఘ్యంబుదధికిచ్చినట్టుల నీ నుండి యిట్టులేను

నీ నుండి పొడమిన నిరుపమ వాగ్ఘరిన్ నిను నుతియించుచున్ నిలిచితిటుల,

తే.గీ. ధన్య జీవుఁడనయితి  సౌందర్యలహరి

శంకరులు వ్రాయఁ దెలిఁగించి, శాశ్వతమగు

ముక్తి, సత్కీర్తి, నొసఁగెడి శక్తి! జనని!

యంకితము చేసితిని నీకు నందుకొనుము. 100

భావము.
భగవతీ!స్వకీయాలైన చేతి దివిటీల జ్వాలలచేత సూర్యుడికి ఆరతి గావిస్తూన్నట్లు చంద్రకాంత శిలనుండి శ్రవిస్తూన్న జలబిందువులచేత చంద్రుడికి ఆర్ఘం సమర్పిస్తూన్నట్లూ, ఉదకాలచే సముద్రుడికి తృప్తికారణమైన తర్పణం కావిస్తూన్నట్లూ , నీ వల్ల పొడిమినటువంటి నీ స్వరూపాలైన వాక్కుల కూర్పులచే నిన్ను నేను స్తుతిస్తున్నాను.

సౌందర్యలహరి స్తోత్రమునకు ఆంధ్రపద్యానువాదము సంపూర్ణము.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.