జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
తే.గీ. నల్లకలువలన్,
మేఘమునల్ల గెలుచు
నల్లనౌ నీకురుల
వాసనను గ్రహించు
బలుని జంపిన
యింద్రుని పాదపంబు
కల్పకము యొక్క
కుసుమముల్ కమలనయన. ॥
43 ॥
భావము.
అమ్మా ! అప్పుడే వికసించిన నల్లకలువవలెను, నల్లని మేఘముల వలె దట్టముగా ఉండి సుకుమారమయి ఉన్న నీ కేశముల ముడి మా అజ్ఞానము అనబడు చీకటిని పారద్రోలును. వాటినుండి వెలువడు సువాసనలను పీల్చుటకు బలుడు అను రాక్షసుని చంపిన ఇంద్రుని కల్పవృక్షముల యొక్క పూలు వాటిని ఆశ్రయించును కదా !
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.