గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 58 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

వంకరనుండు నీ కణఁత భాగములన్ గిరిరాజపుత్రికా!

జంకరదెవ్వరున్ దలపఁ జక్కని కాముని విల్లటంచు,

వ్వంకను కన్నులడ్డముగ భాసిలుచున్ మది నమ్ము విల్లుపై

నంకితమైనటుల్ తలచునట్టులఁనొప్పుచునుండెనొప్పుగన్. 58

భావము.

పర్వతరాజ పుత్రీ ! పార్వతీ ! అందముగా వక్రముగా ఉన్న నీ చెవితమ్మల జంటను చూస్తే, భావుకులకు అవి పుష్ప బాణుడైన మన్మథుడి ధనస్సులో ఏమో అనే భావన కలిగి , చూడ ముచ్చటగా ఉంటుంది . ఎందుకంటే , నీ కడగంటి ప్రసారము , అడ్డముగా తిరిగి చెవి త్రోవను దాటి , (చెవుల అంచుల వరకు చేరి) ప్రకాశిస్తూ బాణములు సంధింప బడుతున్నాయనే ఊహను కల్గిస్తుంది. (దేవి క్రీగంటి చూపులు, మన్మథుడి పూల బాణాలని , శ్రీదేవి చెవి తమ్మెలు (కణతలు), మన్మథుని ధనస్సులనీ భ్రాంతిని కల్గిస్తున్నాయి). వంగిన విల్లు లేదా ఎక్కుపెట్టిన విల్లు నుంచి బాణ పరంపర వర్షించడం సహజమేకదా! ఇక్కడ వర్షించేవి ఎటువంటి బాణాలు ? కరుణా కటాక్షములనే చూపుల బాణాలు . అవి కడగంటి నుంచి మొదలై, చెవుల పర్యంతమేగాక. చెవులనూదాటిపోతూన్నాయికదా!

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.