గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 10 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీశ్రీపాదముల నుండి చిందుచుఁ బ్రవహించు నమృతవర్షంబుతో నలరు నీవు

నిండుగ డబ్బది రెండు వేలున్నట్టినాడీప్రపంచమున్ దడుపుచుండి,

యమృతాతిశయమున యలరెడి చంద్రుని కాంతిని కలుగుచు, కదలుచుండి

మరలమూలాధార మహిత చక్రము చేరి, స్వస్వరూపంబగు సర్పరూప

తే.గీమునను చుట్టగాచుట్టుకొనిన జననివి,

నీవె కుండలినీశక్తి, నిదురపోవు

చుందువమ్మరో! మాలోననుందువీవె.

వందనమ్ములు చేసెద నిందువదన! 10

భావము.

అమ్మా! పాద పద్మముల నుండి ప్రవహించిన అమృత ధారా వర్షముతో డెబ్బది రెండు వేల నాడుల ప్రపంచమును తడుపుతూ తిరిగి అమ్రుతాతిశయము గల చంద్రుని కాంతి కలిగి మరల మూలాధార చక్రమును చేరి స్వస్వరూపమయిన సర్ప రూపముతో చుట్టలుగా చుట్టుకొని కుండలినీ శక్తివయి నిద్రించు చున్నావు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.