జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏻
శ్లో. న పశ్యతి చ జన్మాంధః - కామాంధో నైవ పశ్యతి!
న పశ్యతి మదోన్మత్తః - అర్థీ దోషాన్ న పశ్యతి ||
తే.గీ. పుట్టు గ్రుడ్డి తా కనలేడు పూర్తిగాను,
కనగలేడు కామాంధుండు గణనచేసి,
కనగలేడుమదోన్మాది గౌరవమును,
కనగలేడర్థి చెడు, మంచి, మనసుపెట్టి.
భావము. పుట్టుగ్రుడ్డి చూడలేడు. కామాంధుడు కూడ మంచిచెడ్డలను చూడడు.
మదోన్మత్తుడైనవాడు కూడ ముందు వెనుక చూడడు. కోరికలుగల మనుష్యుడు
కూడా చేయు పనిలోని మంచిచెడ్డల గమనింపడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.