గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 71 || రత్నాదేవి. .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

చంవిరియుచునున్న తామరల విస్త్రుతశోభనె వెక్కిరించు నీ

మురిపెము గొల్పు చేతులను బోల్చగ నాకది సాధ్యమౌనొకో?

సరసిజ వారిజాకరము చక్కగనౌ రమ, పాదలత్తుక

స్ఫురణను బొందినన్ దగును బోల్చఁగఁ గొంత, నిజంబు పార్వతీ! 71

భావము. 

అమ్మా! పార్వతీదేవీ అప్పుడే వికసించిన కమలముల కాంతిని పరిహసించు చున్న నీ హస్తముల కాంతిని ఎట్లు వర్ణింతును? చెప్పుము. కమలములు కమలాలయములు అయిన లక్ష్మీదేవి, పాదముల యందలి లత్తుక రసముతో కలసి అరుణిమ కాంతిని పొందిన యెడల కొద్దిగా పోల్చవచ్చునేమో కదా !

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.