జైశ్రీరామ్.
శ్లో. కృతస్య కరణం నాస్తి - మృతస్య మరణం తథా|
గతస్య శొచనం నాస్తి - హ్యేతద్వేదవిదాం మతమ్||
తే.గీ. చేయఁబడినట్టిదానిని చేయనుండ
దటులె మృతి లేదు మృతికింక, నిటలనేత్ర!
గతముచింతింపనుండదు, గతము గతమె,
వేదవేత్తల మతమిట్లు విదితమగును.
భావము. చేసిన దానిని చేసేదేమిటి? చచ్చిన జీవిని చంపేదేమిటి?
జరిగినదానికి ఏడ్చేదేమిటి? తెలుసుకోన్నచో తొలగును చీకటి. ఇదీ పారమార్థిక
జ్ఞానసంపన్నుల లక్షణమ్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.