ఉ. దీనుఁడనమ్మ! దూరముగ తేజవిహీనుఁడనైన నాపయిన్
నీనయన ప్రదీప్తులను నిత్యముగా ప్రసరింపనీయుమా,
హానియొకింతయున్ గలుగదమ్మరొ నీకుఁ, గృతార్థునౌదు, నా
యేణభృతుండు వెన్నెలనదెక్కడనైనను పంచు తీరునన్. ॥
57 ॥
భావము.
తల్లీ!పార్వతీదేవీ!నీనేత్రముమిక్కిలిదీర్ఘమైకొంచముగావికసించిన నల్ల కలువల కాంతి వంటి కాంతితో చక్కగా ఉన్నది.
నేను
నిన్ను
శ్రద్ధ
గా
ఉపాసించలేని
దీనుడను. కాబట్టి
ఎంత
దూరమైనా
ప్రసరింప
జేయగల
నీ
కడగంటి
చూపును
నీకు
మిక్కిలి
దూరంలో
ఉన్న
నాపై
కూడా
ప్రసరింప
జేసి, నీదృష్టి
నుండి
ప్రసరించే
కృపారసముతో
నన్ను
కూడా(తడుపుము) స్నానమాడింపుము.
నీవు
నీ
కడగంటి
చూపులోని
కృపారసముతో
తడిపినంత
మాత్రము
చేతనే , నేను
ధన్యుడ
నవుతాను. ఈ మాత్రం
నన్ను
కనికరించడం
వలన
నీకు
ఏ విధమైన
లోటూరాదు. (నీకు
పోయేదేమీలేదు)
నీ
వామ
నేత్రమయిన
చంద్రుడు , తన
కిరణాలను
అడవి
లోనూ
రాజభవనముల
మీదనూ
సమముగానే
ప్రసరింపజేస్తున్నాడుకదా!
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.