జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
ఉ. నీదు
విశుద్ధ చక్రమున
నిర్మలమౌ నభతత్త్వ
హేతువౌ
జోదుగవెల్గు
నాశివుని, శొభిలుచుండెడి
నిన్నుఁ గొల్చెదన్
మోదమునొప్పుమీ
కళలుపూర్ణముగా లభియింపఁ
వీడెడున్
నాదగు
చీకటుల్, మదిననంత
మహాద్భుత కాంతినొప్పెదన్. ॥
37 ॥
భావము.
అమ్మా ! నీ విశుద్ధి చక్రమున దోషము లేని స్ఫటిక మణి వలె నిర్మలుడునూ ఆకాశ తత్వము ఉత్పాదకమునకు కారణమయిన శివతత్వమును, శివునితో సమానమయిన యత్నము గల దేవియగు నిన్ను నేను పూజింతును. అట్టి శివాశివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటి గల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానము కలదయిచకోరపక్షి వలే ప్రకాశించును కదా !
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.