సీ.
చెవులఁ దాకెడి నీదు చెన్నారు కనులతోఁ దమను బోల్చుకొను మత్స్యములు బెడిసి
తమ గుట్టుదాగగా దాగుకొనునవియె, యపురూప సౌభాగ్యమమరియున్న
నీ నేత్ర లక్ష్మిని నేర్పున కలువ లావిష్కరించినటులవినఁగ
జెప్పు
నీ కర్ణములకంచు నేర్పుగా దాగుచు పగలు, రేయిని విచ్చు మొగము దాచ,
తే.గీ.
మత్స్య కంటివి నీవమ్మ! మాదు జనని!
కలువ కంటివి, నీరూపుఁ గనెడి కనులు
కనులు నిజముగ, కాకున్న కనులు కావు,
నిన్నుఁ గాంచగాఁ జేయుమా నేర్పునొసఁగి. ॥ 56 ॥
భావము.
అమ్మా!
ఓ అపర్ణా! నీ చెవులకు తాకుతున్నట్లు నీ కనులు కనబడటం వలన, ఆ చెవులకు తమ రహస్యం వెల్లడి కాకుండా తమను అమ్మ కళ్ళతో పోల్చుకున్న చేపలు బెడిసి తమ రూపాలను కనబడనీయకుండా దాక్కున్నాయి. నీ కనులలో నున్న కాంతియైన సౌభాగ్య లక్ష్మి ని కలువలు ఆవిష్కరించాయని నీ చెవులతో నేత్రాలు చెబుతాయేమోనని భయపడి పగలు, ఆ పూవుని విడిచి రాత్రి మాత్రమే ఆ పూవుల రేకు డిప్పలను తెరిచి ప్రవేశిస్తోంది. అమ్మ సౌందర్యముతో తమను తాము పోల్చుకున్నామనే బెరుకు వీటిచే ఆ పని చేయింస్తోంది. కదా.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.