జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
తే.గీ. అమ్మ! నీ దివ్య రూపంబు
కమ్మగాను
వర్ణనము చేయు శక్తితో పరగనిమ్మ!
నమ్మి నినుఁగొల్చుచుంటినోయమ్మ నేను,
వందన్ంబులు చేసెద నందుకొనుము. ॥ 40 ॥
భావము.
అమ్మా!
మణిపురచక్రమే నివాసముగా
కలిగి, చీకటికి శతృవై
ప్రకాశించు శక్తిచేత
విద్యుల్లత మెరుపుగల, ప్రకాశించుచున్న వివిధములైన
రత్నములతోకూడిన ఆభరణములచే
కూడిన ఇంద్రధనుస్సువలె
వెలుగునదియు,
నీలి వన్నెలుగల, శివునిచే దగ్ధమైన, మూడులోకములగూర్చి వర్షించునది
అయిన ఇట్టిది
అని చెప్పుటకు
వీలుకాని మేఘస్వరూపమయిన
శివుని ధ్యానస్వరూపమును
సేవించెదను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.