జైశ్రీరామ్.
శ్లో. దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః.
(శివరహస్యము)
తే.గీ. నాశనమవ దుష్టాచారరాశి ధరను
పూర్వసత్సంప్రదాయముల్ పూర్తిగాను
వ్యాప్తి చేయ సాంబుండుతా పరగ బుట్టె
శంకరాచార్యునిగ, భక్తుల శంకలుడుప.
భావము. దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే
ఆది శంకరుని రూపంలో అవతరించాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.