గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 53 || రత్నాదేవి .. పద్యానువాదము చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

తే.గీనల్లకలువలన్, మేఘమునల్ల గెలుచు

నల్లనౌ నీకురుల వాసనను గ్రహించు

బలుని జంపిన యింద్రుని పాదపంబు

కల్పకము యొక్క కుసుమముల్ కమలనయన. 53

భావము.

శివుని ప్రియురాలైన దేవీ ! పార్వతీ ! కన్పిస్తున్న నీ మూడు

కన్నులునూ , అర్ధ వలయాకారంగా విలాసము కొరకై తీర్చి దిద్ధి కాటుక కలవై , విభజింప బడిన ఎరుపు, తెలుపు , నలుపు అనే మూడు వర్ణములు కలవై యుండి , ప్రళయమునందు నీ యందు లీనమైన బ్రహ్మ , విష్ణు , రుద్రులనే దేవతలను, తిరిగీ బ్రహ్మాండము నందు సృష్టించడానికై సత్వరజస్తమో గుణములనే మూడు గుణములనూ ధరిస్తున్నావా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.