జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
చం. హిమగిరి వంశ శీర్ష సుమ! హే మహిమాన్విత! హైమ! నీదు క
ర్ణములకు కన్నులంటి, ఖగరాజు నెఱిం దలపింపనొప్పి, శాం
తము నడగించి ప్రేమ కరుణారసపూర్ణ శివాత్మఁగొల్ప మా
రు మహిత చాప సోయగపు రోచిగ తోచుచునుండెనమ్మరో! ॥
52 ॥
భావము.
పర్వతాధిపుడయిన హిమవంతుని వంశానికి శిరోభూషణ మైనపువ్వు మొగ్గ వంటి పార్వతీ ! నీ కన్నులు చెవులనంటి యున్నవి . ఆ కన్నుల రెప్పల వెండ్రుకలు , బాణమునకు కట్టబడిన గ్రద్ద ఈకల వలె ఉంటాయి. అవి పరమ శివుని మనస్సులో ని శాంత రసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని ఉత్పన్నము చేయడమే ఫలముగా కల్గి ఉంటాయి. అటువంటి నీ నేత్రములు, చెవుల వరకూ లాగబడిన మన్మథుని బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.