జైశ్రీరామ్.
శ్లో. జానాతే యన్న చంద్రార్కౌ జానతేయన్న యోగిన:
జానీతే యన్న భర్గో-పి తజ్జానాతి కవిస్స్వయం.
తే.గీ. ఎన్నుచును సూర్యచంద్రులున్నెఱుఁగనదియు,
ఎన్నిన్నికను యోగివర్యులున్నెఱుగనదియు
నీశుడైనను జగతిలో నెఱుగనదియు
నెఱుగుకవి తాను స్వయముగానెఱుకఁ గలిగి.
భావము. ఏదైతే సూర్యచంద్రులునూ ఎఱుఁగ లేరో, ఏదైతే యోగీశ్వరులు కూడా
ఎఱుఁగ లేరో, ఏదైతే పరమేశ్వరుఁడునూ ఎఱుఁగలేడో, అది కవి స్వయముగా
తానెఱుఁగును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.