జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
సీ. శ్రీచక్రముననున్నచిన్మయ
బిందువున్ నీముఖసీమగాఁ బ్రేమఁ గనుచు,
దానిక్రిందను కుచ
ద్వయము నాక్రిందను శివునర్థభాగమౌభవుని సతిని,
బిందువు క్రిందను
వెలుగు త్రికోణాన క్లీమ్ బీజమున్ మదిన్ లీలఁ గనుచు
నెవరుందురో వార
లెవరినైననుగాని మోహంబులో ముంచి ముగ్ధులవఁగఁ
తే.గీ. జేయఁ గలుగుదురోయమ్మ! శ్రీకరమగు
దివ్యమైనట్టి యీ
శక్తి భవ్యమైన
నీదు మేరువుదమ్మరో! నిజము గనిన,
నమ్మ! నీపాదములకు నే నంజలింతు. ॥ 19 ॥
భావము.
అమ్మా! పరమశివుని పత్నీ~ పార్వతీ~ శ్రీచక్రం లోని బిందువును నీ ముఖముగాను~ దాని క్రింద స్తనములు~ ఆ క్రింద శివుని శరీరం లోని సగమైన శక్తిని~ బిందువు క్రింది త్రికోణం లో ‘క్లీం ‘ బీజాన్ని భావిస్తూ ఎవడు ధ్యానిస్తాడో అతడు త్రిలోకాలనూ మోహపెట్టగలడు కదా తల్లీ… అంతటి గొప్పదనం నీ మేరు స్వరూపానిది కదా !
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.