జైశ్రీరామ్
ఓం శ్రీమాత్రే నమః.
మ. జననీ!
నీ యధరారుణప్రభలు సాజంబమ్మ! నే దెల్పెద
న్వినుతింపందగు పోలికన్, విద్రుమమే నేర్పున్ ఫలంబున్ గనన్
ఘనమౌ నీయధరారుణప్రభలనే కల్గించునవ్వాటికిన్,
విన సొంపౌ తగు సామ్యమున్ దలపగా వ్రీడన్ మదిన్ బొందదే? ॥ 62 ॥
భావము.
అమ్మా జగజ్జననీ, స్వభావ సిద్ధముగానే కెంపురంగుగల నీ పెదవుల అందమునకు, సరియైన పోలికను చెప్పుచున్నాను. పగడపు తీగె, పండును పుట్టించిగలిగినచో నీ రెండు పెదవులు దానికి సరిపోతాయి. అది
నీపెదవులకాంతితోపగడపండ్లనుపోలుటకుసిగ్గుపడును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.