గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2024, శనివారం

తాత్పర్యసహిత సౌందర్య లహరి - 7 || రత్నాదేవి. .. పద్యానువాదం చింతా రామకృష్ణారావు.

జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.

సీమణిమయ గజ్జలన్ మహనీయ మేఖల మిలమిల కనిపించు మెఱుపుతోడ,

గున్నయేనుగు యొక్క కుంభంబులన్ బోలు పాలిండ్ల బరువుచే వంగినదియు,

సన్నని నడుముతో శరదిందుముఖముతో,చెరకు విల్లు, పూలచెండుటమ్ము

నంకుశమ్మును గల్గి, యరచేతఁ బాశమ్ము గల్గి చూపులనహంకారమొప్పి

తే.గీలోకములనేలు మాతల్లి శ్రీకరముగ

మాకునెదురుగ నిలుచుత మమ్ము గావ,

జన్మసాఫల్యమొసఁగంగ, సన్నుతముగ

ముక్తి సామ్రాజ్యమీయంగ బొలుపుమీర. 7

భావము.

మిల మిల మెరయుచున్న మణుల గజ్జెల మొలనూలు కలిగినగున్న ఏనుగు కుంభముల వంటి కుచముల భారము వలన వంగిన నడుము ఉన్నట్లు కనపడుతున్నదియు, సన్నని నడుము కలిగి, శరత్కాల చంద్రుని వంటి ముఖము కలదియు, చెరకుగడ విల్లునూ, పూవుటమ్మును, అంకుశమును, పాశమును ధరించు చున్న అహంకార రూపు కలిగిన దేవి మా ఎదుట నిలుచు గాక

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.