జైశ్రీరామ్
శ్లో. సా సభా యత్ర సభ్యోఽస్తి - స సభ్యో ధర్మమాహ యః |
స ధర్మో యత్ర సత్యం స్యాత్త - త్సత్యం యత్ర న చ్ఛలమ్ ||
(కథాసరిత్సాగరం)
తే.గీ. సభ్యతను ధర్మమును బల్కు సరసమతులు
సభ్యులై యున్నవే చూడ సభలు భువిని,
ధర్మమది సత్యముండినన్, మర్మ హీన
మైనదే సత్యమరయఁగ నిందువదన!
భావము. సభ్యతగలవాడుంటే మాత్రమే అది సభ అవుతుంది. ధర్మాన్ని
చెప్పేవాడే సభ్యత కలవాడు. సత్యమెక్కడున్నదో అదియే ధర్మము.
మోసమెక్కడ లేదో అదియే సత్యము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.