గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2024, శుక్రవారం

అహో తమ ఇవేదం స్యా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  అహో తమ ఇవేదం స్యా  -  న్న ప్రజ్ఞాయేత కించన !                              

రాజా చే న్న భవేల్లోకే  -  విభజ సాధ్వసాధునీ ||          

(వాల్మీకి రామాయణం 2.67.36.)

ఆ.వె.  మంచిచెడులుతెల్పు మహితాత్ముఁడగు రాజు

ధరను కలుగ వలెను తప్పకుండ,

లేకపోయెనేని లోకంబె చీకటి

మంచిచెడ్డలెవ్వరెంచి చెప్పు?       

భావము.  మంచి చెడులను విడమరచే రాజు లోకంలో లేకపోతే, 

ఏదీ ఏమీ తెలియకుండా పోగలదు. అంతా చీకటితో మూసుకు పోగలదు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.