జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.🙏🏼
సీ. బద్వేలు పురిలోన సద్వేగముగ నిల్చి యుద్వేగములు వాప నుంటివొక్కొ?
ఉద్విఘ్నములు మమ్మునధ్వాన గతి ముంచు, సద్వందితా! పాపు మద్వయితుఁడ!
సద్వార్తలే వినన్ బద్వేలునారాయణాద్వైత! భక్తాళి యనుపమముగ
బద్వేలు రావలె, నద్వానులొచ్చిన న్నుద్వేగభాషణ నొసఁగువాఁడ!
తే.గీ. లక్ష్మితోనీవు వసియించి లక్ష్యమలర
భక్తపాళిని గాచెడి భద్రమూర్తి!
వినుత గద్వాలు పురవాస! ఘన సుచరిత!
సత్యనారాయణా! నిన్ను సన్నుతింతు.
🙏🏼
అమ్మ అనుగ్రహంతో🙏🏼
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.