గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, ఆగస్టు 2024, ఆదివారం

న వ్యాధయో నాపి యమః .. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్. 

శ్లో.  న వ్యాధయో నాపి యమః - ప్రాప్తుం శ్రేయః ప్రతీక్షతే |

యావదేవ భవేత్ కల్పః - తావచ్ఛ్రేయః సమాచరేత్ || (మహాభారతం)

తే.గీ.  వ్యాధులును, యముఁ డాగరు పరగు మంచి

పనిని చేయుచుంటిమనుచు, భవ్యులార!

సమయ మది చిక్కినప్పుడే చక్కనైన

మంచి పనులను చేయక మసల రాదు.    

భావము.  మనిషి సత్కార్యములను చేసి ముగించనీ అని రోగాలుగానీ, 

యముడుగానీ (చావుకానీ) కాచుకుని కూర్చొనివుండవు. ఎప్పుడు అవకాశం కానీ 

సామర్థ్యం కానీ ఉంటుందో అప్పుడే మంచి పనులను చేసివేయాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.