గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2024, గురువారం

న కాష్టే విద్యతే దేవో .. మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  న కాష్టే విద్యతే దేవో  -  న శిలాయాం న మృత్సు చ | 

భావే హి విద్యతే దేవః  -  తస్మాద్భావం సమాచరేత్ ||

ఆ.వె.  కట్టెయందు లేడు కటికి శిలనులేడు,

మట్టిబొమ్మలందు మసలఁబోడు,

భావనముననుండు భగవంతుఁడెప్పుడు,

నాత్మలోనగాంచుమతనిఁ గొలువ.

భావము.  భగవంతుడు కట్టెయందు కాని, రాతియందు కాని, 

మట్టిబొమ్మల యందు కాని లేడు. మన భావనయందు మాత్రమే 

భగవంతుడున్నాడు. కనుక సద్భావముతో విగ్రహారాధన చేయవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.