గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

యత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘ్యస్తత్రల్పధీరపి,... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో.  యత్ర విద్వజ్జనో నాస్తి శ్లాఘ్యస్తత్రల్పధీరపి,

నిరస్త పాదపే దేశే హేరండోపిద్రుమాయతే.

తే.గీ.  పండితులు లేని సభల నపండితుండె

గౌరవంబును పొందును ఘనతరముగ,

వృక్షములులేని చోటులో వెలసియుండు

నాముదముచెట్టె ఘనవృక్షమనుట నిజము.

భావము.

వృక్షములే లేని ప్రదేశములో ఆముదముచెట్టున్నను అది గొప్పదఘ. అటులనే 

పండితులయినవారు లేని సభలలో అల్పజ్ఞులును గౌరవింపబడుదురు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.