గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, సెప్టెంబర్ 2023, గురువారం

*సూర్యుండా యుదయాద్రి నెక్కి పొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.*.... నా పూరణ.

జైశ్రీరామ్. 

ఓం నమో నారాయణాయ.🙏

సమస్యాపూరణ.
👇
శా.  ఆర్యుల్ నిన్ జపియించ తర్పణవిధిన్, హాయిన్ బ్రసాదించుచున్,

కార్యోద్భాస మనోజ్ఞ దీక్షితుడవై కాంతిన్ గృపన్ జిందుచున్,

సౌర్యంబొప్పగ పశ్చిమాద్రికి జనన్, సాయంత్ర వేళంచు నో

*సూర్యుండా! యుదయాద్రి నెక్కి పొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.*

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.