గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 95వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

95. ఆచార బోధిత సమాచారముల్ తెలిసి శ్రీచక్ర పూజ సలుపన్ 

శ్రీచక్రవాసినివి నీచే శుభావళులె మాచెంత నిల్చును కదా.

యాచించి నిన్ గొలుచు స్త్రీ చేతనన్ వెలిఁగి కాచున్ కుటుంబమునిలన్.

స్త్రీ చేతనత్వమది నీ చేతనే కలుఁగు శ్రీచిత్ప్రభా కన సతీ!

భావము.

మంగళప్రదమయిన చిత్తేజమా! ఓ సతీ మాతా!  అనూనముగా 

కొనసాగుచున్న ఆచారములచే బోధితమగుచున్న సమాచారమును 

తెలుసుకొని మంగళప్రదమయిన శ్రీచక్ర పూజ చేసినచో 

శ్రీచక్రమునిలయముగా కల నీచేత మంగళములే మాముందు 

నిలఁబడునుకదా తల్లీ! కాపాడేటువంటి నిన్ను సేవించు స్త్రీజాతి 

చైతన్యముతో వెలుగుచు కుటుంబమును భూమిపై కాపాడుచుండునమ్మా. ఆ 

స్త్రీజాతిలో చేతనత్వమనునది నీచేతనే సంభవించును కదా తల్లీ!

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.