గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 94వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

94. పాపంబులన్ దుడువ కోపంబులన్ దరుమ నీపాదముల్ శరణమౌన్.

నీ పాద దర్శనము నీ పాద చింతనము దీపింపఁజేయును ననున్.

హే పర్వతీ! జనని! శాపంబులన్ దుడిచి నీపైన భక్తిఁ గొలుపన్

నే పుణ్యసత్ఫలమునే పొందుదున్, గనుదె? యో పాపహారిణి! సతీ!

భావము.

పాపములను హరించు ఓ సతీ మాతా! పాపములను తుడిచివేయుటకు, 

కోపాదులను తరిమివేయుటకు నీ పవిత్రమయిన పాదములే మాకు 

శరణమమ్మా.  నీ పాదములు చూచుట, నీ పాదములు తాకుట యనునవి 

నన్ను ప్రకాశింప జేయునవేనమ్మా. ఓ పార్వతీమాతా! నన్ను వెంటాడు 

శాపములను తుడిచివేసి, నీపై భక్తి నాకు కలుగునట్లు చేసితివేని, నేను 

పుణ్యప్రదమయిన మంచి ఫలితమునే పొందుదును. కావున ఆ విధముగా 

చూచెదవా తల్లీ! తప్పక చూడుము.

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.