జైశ్రీరామ్.
105. అంబా విషాద వలయం బేల చుట్టె నను. సాంబున్ సదా కొలుతునే,
సాంబుండు నాకును వరంబై సదానిలువ బింబోష్ట నిన్ గొలుతు,హే
రంబున్ మదిన్ దలతు నంబా శుభాస్పద. కరంబీవె కానవలె నన్.
బింబాధరా!
ఘనతరంబౌ కృపన్ గనుము, డంబంబు పాపెడి సతీ!
భావము.
డంబముగా ప్రవర్తించుటను నశింపఁజేసెడి ఓ సతీ
దేవీ! ఓ అంబా! నన్ను
విషాదవలయము చుట్టుకొనినదేలతల్లీ? నేనెల్లప్పుడూ
సాంబుని
కొలుచుచుందునే సాబుఁడు నాకు వరమై లభింపఁజేయుటకు
నిన్ను
సేవింతునమ్మా. హేరంబుని మనసులో తలంచెదనుతల్లీ!
శుభమునకు
ఆలవాలమయిన ఓ తల్లీ! నీవే గొప్పగా నన్ను కాపాడవలయునమ్మా.
దొండపండువంటి అధరము కల తల్లీ! నన్ను ఘనతరమయిన
కృపతో
చూడుమమ్మా.
జైహింద్..
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.