గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 104వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

104. కాలప్రవాహమునకే లేదుగా తుదియె, నీ లీల కాలము కనన్,

లీలావతీ! గడుచు కాలంబుతో సుగుణ జాలంబు చేర్చుము మదిన్,

నీ లీలలెన్నుచును,హేలన్ కవిత్వసుధ కాళీప్రభా కలితమై

శీలప్రభన్ గొలిపి క్రాలంగ వ్రాయుదును, నా లక్ష్యమీవెగ సతీ!

భావము.

ఓ సతీ మాతా! కాలగమనమునకు అంతమన్నదే లేదు. అది నీ లీలయేకదా 

తల్లీ! ఓ లీలావతీ! గడిచే కాలముతో పాటు నా మనసులో మంచిగుణముల 

సమూహమును చేర్చుమమ్మా. నీ లీలలను గుర్తించుచు విలాసముగా నీపై 

కవితామృతమును కాళీ ప్రభతో నొప్పారునట్లుగా శీలము యొక్క ప్రభను  

అందరిలోనూ కొలిపి ఒప్పునట్లుగా వ్రాయుదునమ్మ. నా లక్ష్యము నీవే 

కదా తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.