జైశ్రీరామ్.
106. దీనాళి నేలెడి సుధీ నామొరన్ వినుమ జ్ఞానంబునే కొలుపుమా.
మౌనంబు వీడి మము ప్రాణంబుగా కనుచు జ్ఞానంబిడన్ బలుకుమా.
నేనేమి పల్క నది క్షోణిన్ శుభంబవఁగ రాణింపఁ జేయఁ గనుమా
జ్ఞానప్రదా! మధుర గానంబుతోఁ గొలుతు నేనే సభక్తిగ సతీ!
భావము.
ఓ సతీ మాతా! దీనజనులను పాలించెడి జ్ఞానవంతురాలివయిన ఓ తల్లీ! నా
మొర ఆలకింపుము. నాకు జ్ఞానమును కలిగింపుము. నీ మౌనమును విడిచిపెట్టి,
మమ్ములను ప్రాణముగా చూచుకొనుచు, జ్ఞానమును మాకు
లభించువిధముగా మాతో మాటలాడుమమ్మా. నేను ఏది పల్కుదునో అది
భూమిపై శుభమగునట్లుగా నన్ను రాణింపఁ జేయు విధముగా నన్ను చూడుము
తల్లీ! జ్ఞానమును ప్రసాదించు ఓ జగన్మాతా! నేనే భక్తియుక్తుఁడనయి నిన్ను
మధురమయిన గానముతో సేవించెదనమ్మా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.