గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

గుణవజ్జన సంసర్గాత్ .... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  గుణవజ్జన సంసర్గాత్

యాతి స్వల్పోఽపి గౌరవమ్ !

పుష్పమాలానుషంగేణ

సూత్రం శిరసి ధార్యతే!!

కం.  గుణవంతులఁ గూడి మనిన

గుణహీనుఁడుకూడ పొందు గొప్పను ధరపై,

మనుటను పూమాలను తా

ఘనముగ శిరమందు నిలుచుకద సూత్రంబున్.

భావము.  గుణవంతులతోనున్న గుణహీనుడు కూడా గౌరవింపబడును. 

సువాసనగల పూ మాలలో దారముగానున్నందున దారము కూడా 

శిరముపై ధరింపబడుచుండును కదా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.