గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 98వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

98. శ్రీకల్వపూడి కుల రాకాసుధాకరులు నాకూర్మి రాఘవ గురుల్

నాకైతకున్ బలము నాకున్ బ్రభాకరులు. నాకున్న శక్తి కనగా.

నేకోరినట్టిఫల మీకావ్య సద్రచన నాకున్ బ్రసాద మరయన్.

నాకున్న సద్గురునికీ కైతనంకితము నే కొల్పెదన్ గొన సతీ!

భావము.

ఓ సతీ మాతా! నాకు ప్రియమయిన నా గురువులు మంగళప్రదమయిన 

కల్వపూడి కులావతంస పూర్ణిమ చంద్రులు. ఎంచి చూడగా నా 

కవిత్వమునకు వారే బలము. నాకు వారు సూర్యభగవానులు. నాకున్న 

శక్తియు వారే. సద్రచన అయిన ఈ కావ్యము నేను కోరుకొరుకొనిన 

ఫలమే. చూడగా ఇది నాకు మహాప్రసాదము. నాకు ఉన్నటువంటి 

సద్గురువులయిన శ్రీమాన్ కల్వపూడి వీరవేంకట రాఘవాచార్యులవారు 

స్వీకరించునట్లుగా ఈ శ్రీ అష్టోత్తరశత సతీ అశ్వధాటి యగు సతీ శతకమును 

అంకితము చేసెదనమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.