గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 74వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

74. దేదీప్యమానమగు నీ దివ్య రూపము ప్రమోదంబుతో కనుటకై

యేదారియున్ గనక నీ దివ్య పాదముల నే దారిగా కలిగితిన్.

మోదంబుతో కనుమ వాదేలనమ్మ,  కనరాదా ననున్ధరణిపై

ఓ దేవి నీవె నను కాదన్న వేరెవరు నాదారియౌదురు సతీ!

భావము.

ఓ సతీ మాతా! మహోజ్వలముగా ప్రకాశిచు నీ దివ్యమయిన స్వరూపమును 

ఆనంద పారవశ్యముతో చూచుటకైఏ మార్గమూ కానరాక, నీ యొక్క 

గొప్పవయిన పాదములనే దారిగా చేసుకొని యుంటినమ్మా. వాదులాట 

యేలనమ్మా, నన్ను ఇష్టముతో చూడుము తల్లీ! భూమిపై నీవు నన్ను 

చూడరాదా యేమి? ఓ దేవీమాతా! నీవే కాదన్నచో నాకు మార్గము 

యింకెవరగుదురమ్మా? తప్పక నీవే నాకు దారిగా అగుము తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.