గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 73వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.


73. ఓ దేవదేవి! పరమోదార సద్గుణమె నాదారి చేయుజననీ.

నీ దివ్య తేజసము నీ ధర్మ పోషణము మేధావులెన్నుదురిలన్.

బాధల్ విడన్ గొలిపి బోధల్ మదింగొలుపు శ్రీధర్మ తేజసవుగా.

బోధావహంబయిన వేందాంతదీప్తివిగ హేదీనబాంధవి సతీ!

భావము.

దీనబంధువయిన ఓ సతీ మాతా! ఓ దేబదేవీ! గొప్ప ఉదారమయిన 

మంచిగుణమే న మార్గముగా చేయు జననీ!ీ ధార్తిపై జ్ఞానవంతులు 

ఎల్లప్పుడూనీ గొప్పదయిన కాంతి, నీవు చేసెడి ధర్మపరిపోషణమును 

ఎన్నుచుందురమ్మా మా బాధలను విడిపోవునట్లుగా చేసి, మా మనస్సులలో 

జ్ఞానమును కలుగఁ జేయునటువంటి లక్ష్మీప్రదమయిన తేజస్వరూపిణి 

వమ్మా నీవు. నీవు బోధకు మూలమయి వేదాంత తేజమేనమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.