గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 63వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

63 పంకేరుహాక్షివి! యుటంకింతు నీ మహిమ సంకాశమే కననిదం

చింకేమి చెప్పుదును, జంకేల పొందుదును, శంకన్ బ్రవర్తిలుదునా.

ఓంకార రూపిణి! యహంకారమున్ దుడిచి శ్రీంకారమున్ నిలుపుమా.

హ్రీంకార బంధుర యహంకారమున్ గొలుపు మైంకార భాసిత సతీ!

భావము.

ఐంకారమున ప్రకాశించు ఓ సతీమాతా! పద్మములవంటి కన్నులు కల 

తల్లివి నీవు. నీ మహిమ సాటియే లేనిదని పలుకుదును. ఇంతకన్నా మరేమి 

పలుకుదును తల్లీ! నే ఆ విధముగ పలుకుటకు ఎదులకు జంకుదునమ్మా? 

అనుమానములతో ప్రవర్తించను తల్లీ! ఓంకార స్వరూపివయిన తల్లీ! నాలోని 

అహంకారమును పూర్తిగా నశింపఁ జేసి, శ్రీంకారమును నిలుపుమమ్మా.ంఈవు 

కలిగి యుండెడి హ్రీంకారముతో కూడుకొనిన వాటి విషయములలో 

అహంకారమును నాయందు కలిగించుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.