గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 62వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

62 సంగీత సాహితులు ముంగొంగు పుత్తడిగ లొంగున్ త్వదీయ కృపచే

నింగిం గనంబడు విహంగంబులం గలవు సంగీత రూప జననీ!

సంగీత సాధకుల సాంగత్యమున్ గొలుపు, సంగీతమబ్బుటకునై,

సంగీత మబ్బిన యనంగారినే గొలుతు, సంగీత భాసిత సతీ!

భావము.

సంగీతమునందు ప్రకాశించు ఓ సతీ మాతా! నీ కృప యున్నచో మాకు సంగీత 

సాహిత్యములు కొంగుబంగారమై నిలుచునుకదా. సంగీత రూపమున ఉన్న ఓ 

మాతా! నీవు ఆకాశమున ఎగురు విహంగములలోనూ నీవు ఉంటివమ్మా. నాకు 

సంగీతము అబ్బుట కొఱకు సంగీత సాధకులయొక్క సాంగత్యమును 

కల్పింపుమమ్మా. నాకు సంగీతమబ్బినచో ఆ పరమేశ్వరుని కొలిచెదను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.