గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).30వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

30. సంతానమున్ గొలిపి సంతాపమున్ గొలుప చింతేకదా ఫలితమౌన్. 

సంతాపమున్ విడిచి సంతానమిచ్చిన సుఖాంతంబెగా జననమే. 

సంతాన హీనులకు సంతానమున్ గొలిపి శాంతంబుగా బ్రతుకనీ. 

సంతాప హీన మదినంతేసువాసివయి సాంతంబు కాంచుము సతీ! 

భావము.

ఓ సతీ మాతా! నీవు మాకు సంతానమునిచ్క్ష్చి వారిని గూర్చి సతాపమును కూడా 

యిచ్చుట వలన చింతయే కదా మాకు దక్కెడి ఫలితము. 

సంతాపమునిచ్చుట మాని సంతానమునే నీవొసగియున్నచో పుట్టక మాకు 

సుఖాంతమగును కదా. సంతానము లేనివారికి సంతానభాగ్యమును 

ప్రసాదించి శాంతిని ప్రసాదించి శాంతముగా వారిని బ్రతుకనిమ్ము. 

సంతానము లేనివారి మనసులలో నీఉండివారి పరిస్థితిని గమనింపుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.