గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).24వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్. 

24. ఆహారమీవె కన నాహార్యమీవె, కల మోహంబు నీవె జననీ!

మోహంబు నీవయిన మోహార్తినే తరిమి స్నేహంబుతో మెలఁగనీ. 

దేహంబు నీవగుచు స్నేహంబు నీవగుచు మోహంబుపై నుతమతీ!

రాహిత్యముం గొలిపి దేహంబులోనిలిచి సాహాయివై నిలు సతీ! 

భావము.

ఓ సతీమాతా! ప్రాణశక్తినొసగు ఆహారము నీవేనమ్మా. ఆహ్లాదజనకమయిన 

అలంకారములూ నీవే తల్లీ.  ఓ అమ్మా! ఆత్మలో పుట్టేటువంటి మోహము కూడ 

నీవేనమ్మా.. నీవే మోహమయియున్ననాడు మాలోని మోహార్తిని 

తరిమివేసి,స్నేహ భావముతో మమ్ములను మసలనిమ్ము. నుత మయివయిన 

ఓ జగన్మాతా! మా దేహమూ నీవే అయియుండి, మాలోని స్నేహమూ నీవే 

యగుచు మోహమును పూర్తిగా వీడునట్టుల జేసి, మా దేహములో నీవే నిలిచి 

యుండి మాకు సహాయపడుము తల్లీ!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.