గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).23వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

23. కాలంబు నీవనుచు నీలీలలం గనుచు లోలోన పొంగుదునుగా. 

నీలాల మేఘముల నీ లీలలే కనుదు నాలోన గాంచెద నినున్. 

నీలాల మేఘమది నాలోని మాయ కన పాలింతు వీవటులనే 

శ్రీలాలితీ సుగుణ జాలంబు నీవె కద,  యీ లీలఁ  గాంచెద సతీ! 

భావము.

ఓ సతీమాతా! నీవే కాలముగా ఉన్న దానివని భావించుచు, నీ లీలలను 

మనసులోఁ జూచుచు, నాలో నేను పొంగిపోవుచుందును. నీల మేఘములలో నీ 

లీలలనే చూచుదును. నేను చెప్పిన ఈ నీల మేఘము నాలో ఉన్న 

మాయయే. నీవు ఈ విధముగనే నన్ను పాలించుచుంటివి కదా మంగళప్రద 

మయిన, లలితమయిన సుగుణజాలము నీవే కదా తల్లీ! ఈ లీలను నేను 

నిరంతరమూ చూచుదును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.