గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము).22వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

  జైశ్రీరామ్. 

22. బాలార్క తేజమునఁ బాలింప భక్తులను స్త్రీలన్ వెలుంగుదె యిలన్?

నీలీలలన్ గనఁగ చాలంగలారెవరు? నీలాలకా భగవతీ! 

నాలోని మాయ నిఁక నీ లీలచేఁ దునిమి పాలించు నన్నిలఁ గృపన్.

భూలోక వాసుల కహో, లోన మాయనిడి నీ లీలఁ జూపితె? సతీ!

భావము.

ఓ సతీమాతా! భూమిపై బాల సూర్య ప్రకాశముతో నీ భక్తులను పాలించుట 

కొఱకు నీవు ఆడువారియందు ప్రకాశించుచుందువా తల్లీ? నల్లని 

ముంగురులతో నొప్పుచున్న ఓ లోక మాతా! నీ లీలలను చూడఁగలిగినవారీ 

భూమిపై ఎవ్వరునూ లేరు కదా. నా లోన ఉండెడి మాయను నీ లీలచే పోఁ గొట్టి 

కృపతో నన్ను పాలించుమమ్మా. భూజనులలో మాయను ప్రవేశపెట్టి నీ 

లీలను కనఁబరచితివా జగజ్జననీ?

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.