గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

శ్రీ వసంతతిలక సూర్యశతకము 21 నుండి 25 వరకు... రచన చింతా రామకృష్ణారావు.... గానం శ్రీమతి సిశీలాదేవి.బీ.

 

జైశ్రీరామ్.
01 నుండి 05 వరకు 18 - 8 - 2023
06 నుండి 10 వరకు 18 - 8 - 2023
11 నుండి 15 వరకు 18 - 8 - 2023
16 నుండి 20 వరకు 18 - 8 - 2023
వ తేదీని ప్రచురించఁబడినవి.

21. జ్ఞానంబు తేజసమె. కావున నిన్నెఱుంగన్  

జ్ఞానంబు కల్గునటగా కరుణాలవాలా.

దీనావనా సుగుణ తేజసమిమ్ము మాకున్.  

జ్ఞానంబదే కొలుపు గాంచఁగ సూర్యదేవా!  

22. ఆరోగ్య సౌఖ్యములనాదిగనిచ్చువాడా!

నీ రాక మాకిటననేకశుభంబులిచ్చున్.

భారంబు నీదె. జయ భాగ్యద. కావు మమ్మున్.  

నీరేజమిత్ర! మము నిల్పుమ సూర్యదేవా!  

23. తారాడు గర్వనిశి దంబమడంచు వీరా!  

స్వైరంబుగా తిరుగు పాప వినాశకారీ.

భారంబు నీదెకద, వందనమాచరింతున్. 

కారుణ్యమొప్ప ననుఁ గావుమ సూర్యదేవా!  

24. సాగింప వచ్చెదవు జాగృతిఁ గొల్పి సృష్టిన్.  

నీ గాత్రమే యరుణ నిర్భర వర్ణమొప్పన్

వేగంబె వచ్చి కనువిందుగనుందువయ్యా.

నేఁ గాంచి మ్రొక్కెదను నిన్ మది సూర్యదేవా! 


25. జీవాత్మవీవె. జయశీలమునిత్తువీవే.  

భావోన్నతంబు పరివర్ధన చేతువీవే.

నీవాడ నన్ గనుము నీవిక ప్రేమతోడన్.  

దేవాదిదేవ! వినుతింతును సూర్యదేవా!  

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.