గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 107వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

107.  కామేశ్వరీ! కృపను బ్రేమామృతంబు నిక నామీద జిల్కఁ దగదా?

నీ మాతృ వత్సలత, నా మీదఁ జూపుచును క్షేమంబు గొల్పఁ దగదా?

యేమాత్ర మేనెఱుఁగ నీ మాన్యతన్ , దెలిపి నా మీద నీదు కృపతో

హేమాద్రి పుత్రి! వర ధామంబుగా నిలుము, ప్రేమన్ భజించెద సతీ!

భావము.

ఓ సతీ మాతా! కామేశ్వరీతల్లీ! నీవు కృపతో ప్రేమాంఋతమును నాపై 

చిలుకుట నీకు తగదా? నీ మాతృ వాత్సల్యము నాపై చూపుచు నాకు 

క్షేమమును కలుఁగఁ జేయుట నీకు తగదా తల్లీ? నీ గొప్పతనమును నేను 

ఏమాత్రమూ ఎఱుఁగనమ్మా. నామీద నీకు గల కృపతో అది నాకు 

తెలియఁజేసి, ప్రేమతో శ్రేష్ఠమయిన ధామముగా నాకొఱకు నీవు 

నిలిచియుండుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.