జైశ్రీరామ్.
108. శ్రీమంగళాంగివి. సదామంగళంబులను క్షేమంబుఁ గూర్చుచు మమున్
శ్రీమంతమార్గమున శ్రీమంత భావనల ప్రేమన్ వసింపఁ గనుమా.
నీ మంగళాకృతికి శ్రీమంగళంబగుత, భూమిన్ శుభాకరముగా
నీమంచితోఁ గొలిపి ధీమంతులన్ గనుమ శ్రీమాతరో! శుభ సతీ!
భావము.
శుభప్రదవైన ఓ సతీ మాతా! మంగళప్రదమయిన అగములు
వేదవేదాంగములు కల తల్లీ! ఎల్లప్పుడూ మంగళములను, క్షేమమును, మాకు
కల్పించుచు మమ్ములను మంగళప్రదమయిన మార్గముననే
మంగళప్రదమయిన భావములతో సంచరించునట్లు చూడుమమ్మా. నీ
మంగళప్రదమగు జగదాకారమునకు లక్ష్మీప్రద మంగళము అగునుగాక.
భూమిపై శుభములకు ఆధారముగా ధీమంతులను నీమముతో కల్పించి
చూడుమమ్మా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.