గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 82వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

82. లీలావినోదముగనేలో సృజించుటిది. నీలీల లెన్నఁ దరమా.

జాలంబదేల మము పాలింపగా శుభములే లక్ష్యమై కొలుపుచున్.

బాలుండనమ్మ. మది పాలించు తల్లివిగ. జాలింగనం దగదొకో.

లోలాక్షి నీ దయను పాలింమీ జగతి నే లీలనైనను సతీ!

భావము.

ఓ సతీ మాతా! లీలావినోదముగా ఈ సృష్టిని సృజించుటెందులకు తల్లీ? నీ 

లీలలను గెఅహించుట మా తరము కాదకదా. శుభములను కొలుపుటనే 

లక్ష్యముగా కలిగి మమ్ము పాలించుటలో ఆలస్యము చేయుటెందులకు 

తల్లీ? నేను బాలుఁడనమ్మా. మంస్పూర్వకముగా నన్ను పాలించే తల్లివి నీవే 

కదా. జాలితో నన్ను చూచుట నీకు తగును కదా తల్లీ! ఓ చంచలాక్షీ! నీదయతో 

యే విధముగనైనను ఈ సృష్టిని పాలింపుమమ్మా.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.