గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 78వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

78. సారస్వతంబు కన నోరాజ్ఞి నీవె కద. నీరాక మాకు వరమే.

నీ రాకకై వలతు నే రాత్రియున్ బవలు. చేరన్ననున్ తలచవా.

చేరన్ నినున్ మనసు మారున్ సుబోధఁ గని శ్రీరామరక్షయగునే.

యో రాక్షసాంతకి సుధారాశి రమ్మికను ధీరాత్మ నీయఁగ సతీ!

భావము.

ఓ సతీ మాతా! ఓ మహారాజ్ఞీ! సారస్వతమును పరిశీలించినచో అందు నీవే 

కదా ఉందువు. నీవు వచ్చినచో అది మాకు వరమేనమ్మా. నేను నీవు 

వచ్చెదవని ఎదురు చూచుచు ఉందునమ్మా. నన్ను నీవు చేరవలెనని 

ఆలోచించకుందువా తల్లీ! నిన్ను చేరినచో మనసునకు బోధకలిగి నాలో 

మార్పు సంభవించి అది నాకు శ్రీరామరెఅక్షగా ఉండునమ్మా. ఓ రాక్షస 

సంహారిణీ! ఓ అమృతరాశీ! నాకు ధీరత్వమును పొందిన 

ఆత్మను దయ చేయుట కొఱకు రావమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.