గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 77వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

77. విజ్ఞానమీవె కద. విజ్ఞాన తేజము మనోజ్ఞంబుగా నొసగు మీ

యజ్ఞానమన్ నిశిని విజ్ఞాన తేజమున  ప్రాజ్ఞుల్ కనన్ విడిచెదన్.

సుజ్ఞేయమౌ నిను నవజ్ఞన్ గనన్ జనక విజ్ఞానదూరునయితిన్

విజ్ఞానమిచ్చి కను జ్ఞానంబునిమ్ము నిను. రాజ్ఞీ! గుణోన్నత సతీ!

భావము.

మహోన్నత గుణ ప్రకాశినివయిన ఓ సతీ మాతా! విజ్ఞానమనగా అది నీవే 

కదా, అందుచే విజ్ఞానప్రకాశమును మాకు మనోజ్ఞముగా 

ప్రసాదించుమమ్మా. ఈ నాలో ఉన్న అజ్ఞానమనెడి రాత్రిని విజ్ఞానమనెడి 

కాంతిచేయప్రాజ్ఞులు గుర్తించి చూచు విధముగా విడిచిపెట్టుదునమ్మా. 

గొప్పగా యెఱుగఁబడు నిన్ను నిర్లక్ష్యముచే  చూడలేక విజ్ఞానమునకు 

దూరమయితిని. ఓ మాహా రాణీ! నాకు విజ్ఞానమును ప్రసాదించి నిన్ను 

చూచెడి జ్ఞానమును ప్రసాదింపుమమ్మా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.