గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 72వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

72. శ్రీభారతీ జనని! నా భావమున్ గనుచు, శోభిల్లఁ జేయుము ననున్,

శోభిల్లఁ జేసిన మహాభాగ్య మైన తమ వైభోగమే కనెద, నీ

వైభోగమున్ గనిన వైభోగ మబ్బుఁ గద స్వాభావికంబు విడువన్.

నా భాగ్య మీవె కద, నా భార మీదె కద సౌభాగ్య దా! వర సతీ!

భావము.

సౌభాగ్యప్రదవయిన తల్లీ! శ్రేష్ఠురాలివయిన ఓ సతీ మాతా! ఓ 

భారతీమాతా! నా మనసులోని భావమును గమనించుచు నన్ను శోభిల్లునట్లు 

చేయుమమ్మా. నన్ను నీవు శోభిల్లఁ జేసినచో గొప్ప భాగ్యమయిన 

తమయొక్క వైభోగమును చూచెదనమ్మా. నీ వఒభవమును చూచినచో 

నాకునూ స్వభావసిద్ధమయిన ఐహికములు దూరమయి ఊహాతీత  

వైభోగము అబ్బునుకదా తల్లీ! నా భాబ్యము నీవే కదా తల్లీ! నా భారము 

కూడా నీదే కదా. 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.