గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, సెప్టెంబర్ 2023, బుధవారం

అష్టోత్తరశత సతీ అశ్వధాటి (సతీ శతకము). 67వ పద్యము. రచన. చింతా రామకృష్ణారావు. గానము ... శ్రీ కుమార సూర్యనారాయణ.

 జైశ్రీరామ్.

67. రాజేశ్వరీ! వినుత రాజీవ నేత్రి! నిను పూజించనిమ్ము కృపతోఁ

బూజింతు నీ పద సరోజంబులన్ సతము రాజిల్లు నాదు మదిలో.

రాజిల్లఁ జేయుము సరోజాక్షులన్ భువిని స్త్రీజాతినెన్ని కృపతో

మా జీవమీవనుచు స్త్రీజాతి నమ్మి నిను పూజింత్రు, నమ్ముము, సతీ!

భావము.

ఓ సతీ మాతా! ప్రశంసింపఁబడు పద్మములవంటి కన్నులు కల తల్లీ! ఓ 

రాజేశ్వరీ మాతా! నీ పాదపద్మములను నేను పూజింతునమ్మా! కృపతోనిన్ను 

పూజించనిమ్ము. నా మదిలో నీవు యెల్లప్పుడూ ప్రకాశించుమమ్మా. 

పద్మముఖులయిన స్త్రీ జాతిని నీవు పరిగణించుచు, వారిని వెలుగొందునట్లు 

చేయుమమ్మా. మా జీవము నీవే అని భావించుచు స్త్రీజాతి నిన్ను నమ్మి 

పూజింతుతురమ్మా. నా మాటలు విశ్వసింపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.